ఈ రోజు రాత్రికి దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్న మంత్రి నారాయణ
దుబాయ్(Dubai)లో ఏపీ మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఆయన బృందం 3 రోజులుగా దుబాయ్‌లో పర్యటిస్తోంది. ఇవాళ బీఆ(BEEAH)ఫెసిలిటీ, టెక్టాన్(Tecton) ఇంజనీరింగ్, అరబ్-ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశంకానున్నారు. బీఆ(BEEAH)ఫెసిలిటీ సంస్థ.. వేస్ట్ మేనేజ్మెంట్(Waste Management), రికవరీ ప్లాంట్లు(Recovery Plants), వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్చన్ కంపెనీ.. విద్యుత్(Power), ఆయిల్(Oil), గ్యాస్(Gas), వాటర్ ప్రాజెక్ట్స్ (Water Projects) నిర్మాణంలో పేరుగాంచింది. అరబ్-ఇండియా స్పీసెస్ సంస్థ.. ఆహార ధాన్యాల ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మంత్రి నారాయణ ఆయా సంస్థల చైర్మన్లతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు (Investments) పెట్టాలని ఆహ్వానించనున్నారు. ఈ రాత్రికి దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు.

