Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిElections | మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Elections | మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనున్న సందర్బంగా ఎన్నికల నిర్వహణాధికారులు బుధవారం మొయినాబాద్ లోని పలు పోలింగ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీచేశారు. సిడిఎంఎ అధికారి టి.కె.శ్రీదేవి ఐఏఎస్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ కె. ఫల్గుణ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ వి. సాయి నాథ్ మొయినాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

వార్డుల ఎలక్టోరల్ ప్రిపరేషన్, ఫోటో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్–ఫైనల్ పబ్లికేషన్, పోలింగ్ స్టేషన్ల ఎంపిక, సెన్సిటివ్ పోలింగ్ సెంటర్ల వర్గీకరణ, ఆన్‌లైన్ ఓటర్ల జాబితా–మ్యాపింగ్ అంశాలను పరిశీలించదం జరిగింది. అజీజ్‌నగర్ హైస్కూల్‌లోని పోలింగ్ స్టేషన్లు, మాక్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్/రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్‌తో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News