Homeహైదరాబాద్‌Raithe Raju | నిత్య కృషీవలుడు రైతు

Raithe Raju | నిత్య కృషీవలుడు రైతు

  • ఎల్బీ స్టేడియంలో రైతే రాజు శీర్షికన సాంస్కృతిక ప్రదర్శనలు
  • చిన్నారుల నృత్య ప్రదర్శన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థసౌజన్యంతో శ్రీసాయి అలేఖ్య ఆర్ట్స్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో రైతుకు వందనం రైతే రాజు పేరిట సాంస్కృతిక నృత్య ప్రదర్శ నలు నిర్వహించారు. 5 వేల మంది కళాకారులతో రైతుకు నీరాజనం కల్పిస్తూ ప్రదర్శించిన నృత్యం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన త్రిదండి చిన జీయర్ స్వామి మాట్లాడుతూ. 6 సార్లు రైతుల కోసం రైతులతో పాదయాత్రను చేసినట్లు తెలిపారు.

Rythu Raju World Record Dance

రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ వారి కష్టాలకు ప్రతిఫలాన్ని చూపే విధంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ భూమి సేద్యంలో తక్కువ నీరు వాడి ఎక్కువగా దిగుబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న చిన జీయర్ స్వామితెలిపారు. నిస్వార్థంతో పనిచేసే నిత్య కృషీవలుడు రైతు అని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సత్కరించారు.

- Advertisement -
Rythu Raju World Record Dance2

కార్యక్రమం లో విజన్ వివికె ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కుమార్, రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు,శ్రీ సాయి అలేఖ్య సాo స్కృతిక సంఘ సేవ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గౌడ్, వండర్ వరల్డ్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ ,మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సినీ నిర్మాత సత్యనారాయణ చైతన్య స్కూల్స్ ఎండి, శివరాత్రి యాదగిరి, జనగాం సాంస్కృతిక టీం ఇన్చార్జి జనగాం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News