Thursday, March 5, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంరిపోర్ట్‌ సబ్మిట్‌ చేయకపోతే మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌కి లక్ష రూ,, ఫైన్‌

రిపోర్ట్‌ సబ్మిట్‌ చేయకపోతే మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌కి లక్ష రూ,, ఫైన్‌

  • తీర్పు చెప్పిన జాతీయ హరితట్రిబ్యునల్‌ చెన్నై బెంచ్‌
  • 13.02.2026 లోపు రిపోర్టు సబ్మిట్‌ చేయకపోతే లక్ష ఫైన్‌ కట్టిన తర్వాతేరిపోర్టుకు సబ్మిట్‌ చేయడానికి అనుమతి
  • మూడు నెలల్లోనే సమస్య పరిష్కరిస్తామనిఎన్జీటీకి నివేదిక ఇచ్చిన అధికారులు
  • మంటలు వ్యాప్తి చెందకుండా అదనపుఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేస్తామనిచెప్పిన అధికారులు
  • సంవత్సరం రోజులు గడిచినా పట్టింపు కరువు
  • దట్టమైన పొగతో రోగాలస్తున్నాయంటూస్థానికుల ఆవేదన

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆండాలమ్మ కాలనీ డంపింగ్‌ యార్డ్‌ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమ్‌ పాష , జాతీయ హరిత ట్రిబ్యునల్‌ వారికి ఫిర్యాదు ఇవ్వగా, కేసు పలుమార్లు హియరింగ్లకు రావడం జరిగింది . కానీ మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ వారికి రిపోర్టు సబ్మిట్‌ చేయకపోవడం వల్ల తదుపరి హియరింగ్‌ డేట్‌ 13.2.2026 న ఇవ్వడం జరిగింది, గడువులోపు రిపోర్టర్‌ సబ్మిట్‌ చేయకపోతే లక్ష రూపాయల ఫైన్‌ కట్టిన తర్వాత రిపోర్టు సబ్మిట్‌ చేయడానికి అనుమతి ఉంటుందని జాతీయ హారిత ట్రిబ్యునల్‌ చెన్నై బెంచ్‌ ఇచ్చిన తీర్పులో పేర్కొనడం జరిగింది.

రిపోర్టు ఇచ్చినా కదలని ప్రక్రియ

అండాలమ్మ కాలనీలోని డంప్‌ యార్డును నగరానికి దూరంగా తరలించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి వ్యర్ధాలను కాల్చినప్పుడు వెలువడే దట్టమైన పొగ, కార్బన ఉద్గారాలతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని, ఇక్కడి నుంచి డంప్‌ యార్డును తరలించాలని స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో గతేడాది జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి ఆమ్‌ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నయీమ్‌ పాషా ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ న్యూఢల్లీి బెంచ్‌, కలెక్టర్‌, మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులతో జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేశారు.

- Advertisement -

డంప్‌ యార్డు పరిశీలించిన కమిటీ ఇక్కడి పరిస్థితులపై రిపోర్ట్ను సబ్మిట్‌ చేసింది. మూడు నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని గతేడాది ఏప్రిల్లో నివేదిక ఇచ్చింది. కానీ, సంవత్సరం రోజులు గడుస్తున్నా డంప్‌ యార్డు తరలింపు ప్రక్రియ ముందుకు కదల్లేదు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక ఎన్జీటీని తప్పు దోవ పట్టించేలా అధికారులు నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో ఏముందంటే..

2000 సంవత్సరం నుంచి వార్డు నంబర్‌`9లో ఉన్న అండాలమ్మ కాలనీలో గల రెండెకరాల్లో వ్యర్థాలను డంప్‌ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజూ 45 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. అయితే ఈ వ్యర్థాలను ఇక్కడ డంప్‌ చేయకుండా హజీపూర్‌ మండలం పోచంపాడులోని 4 ఎకరాల్లోకి తరలించాలనుకున్నారు. కానీ అక్కడి స్థానికులు వ్యతిరేకించడంతో అది సాధ్యం కాక.. ప్రస్తుతమున్న స్థలంలోనే డంప్‌ యార్డును కొనసాగిస్తున్నారు.

అండాలమ్మ కాలనీలోని డంపోయార్డును సందర్శించినప్పుడు అక్కడ ఎలాంటి మంటలు, పొగను గుర్తించలేదు. ఈ యార్డులో వర్కింగ్‌ కండీషన్లో ఉన్న బోర్వెల్‌ ఉంది. ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడితే ఆర్పేందుకు అది ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా ప్రతి రోజూ రెండు వాటర్‌ ట్యాంకర్లు అక్కడ ఉంటున్నాయి. స్థానికంగా నివాసం ఉండే వారిలో కొందరు దుర్మార్గులు ఆశాంతి కలిగించాలనే ఉద్దేశంతో డంప్‌ కు నిప్పు పెడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు 24 గంటల పాటు వాచ్మెన్లు షిఫ్టుల వారీగా డంప్‌ యార్డు దగ్గర పని చేస్తున్నారు. వారి దగ్గర స్థానిక ఫైర్‌ స్టేషన్‌ ఫోన్‌ నంబర్‌ ఉంది. ఎప్పుడు మంటలు చెలరేగినా వారు ఫైర్‌ స్టేషన్ను సంప్రదిస్తారు.

డంప్‌ యార్డులో చెత్తను బయో మైనింగ్‌ చేసేందుకు తెలంగాణ స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చర్యలు చేపట్టింది. టైమ్‌ బాండ్‌ పెట్టుకొని 2024 సెప్టెంబర్‌ నెలలోగా బయోమైనింగ్‌ పూర్తి చేస్తాం. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించాం. స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా రానున్న మూడు నెలల్లో వేరే ప్రాంతానికి డంప్‌ యార్డు తరలించి, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ డిస్పోజల్‌ చేపడుతాం. ఎండాకాలం ఫైర్‌ యాక్సిడెంట్స్‌ ఎక్కువగా జరిగే అవకాశమున్నందుకు అదనపు ఫైరింజన్‌ వాహనాలను సమకూరుస్తాం. మరో చోట డంప్‌ యార్డు ఏర్పాటు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశమున్నందున, అప్పటి వరకు స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.

త్రీమెన్‌ కమిటీ ఎన్సీటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని స్థానికులు మండిపడు తున్నారు. డంప్‌ యార్డు దగ్గర పగలు మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఉంటున్నదని, రాత్రివేళ ఎవరూ ఉండడం లేదని వారు చెబుతున్నారు. బయో మైనింగ్‌ లో మిగిలిపోయిన చెత్తకు రాత్రివేళ నిప్పు పెడుతు న్నారని, దీంతో భరించలేని దుర్వాసనతో పాటు పొగ వస్తుందని వాపోతున్నారు. రాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కాల్చి పోతున్నారని చెబుతున్న అధికా రులు వారిని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

డంప్‌కు మంటలు అంటు కున్నప్పుడు వాటిని ఆర్పేందుకు వాటర్‌ ట్యాంకర్లు పెట్టినట్లు చెప్పింది అవాస్తవమే అంటున్నారు. మంటలు అంటుకున్నప్పుడు మాత్రమే ఆ ట్యాంకర్లు వచ్చి చల్లారుస్తున్నాయి తప్పితే అక్కడే అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. నిత్యం పొగలు వస్తూనే ఉన్నాయి అంటున్నారు. ఒక్కసారి నిప్పు పెట్టి పోతే రోజుల తరబడి పొగలోనే బిక్కుబిక్కు మంటూ ఉండాల్సి వస్తుందని వాపో తున్నారు. మొన్నటి వరకు డంప్‌ యార్డును తరలిస్తామని చెప్పిన అధికారులు కొన్ని రోజులుగా బయో మైనింగ్‌ చేస్తున్నాం.. ఇక ఎక్కడికి తరలించేది లేదని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్జీటీకి ఇచ్చిన నివేదికను అనుసరించి డంప్‌ యార్డును సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో పని చేసిన కలెక్టర్‌ డంప్‌ యార్డును ముందు పోచంపాడుకు తరలిస్తామని చెప్పారని, అక్కడ కుదరకపోవడంతో నస్పూర్‌ పరిధిలోని తాళ్ళపల్లి గ్రామం లోని 20 ఎకరాల్లోకి తరలిస్తామని చెప్పారని గుర్తు చేశారు. స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు డంప్‌ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ` నయీం పాషా

మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే, మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ఈ విషయంలో వారు కల్పించుకొని ఈ డంపింగ్‌ యార్డ్‌ వల్ల ప్రజలు పడుతున్న బాధలను, ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించి, డంపింగ్‌ యార్డ్‌ను మరో చోటకు మార్చి, బయో మైని ంగ్‌ప్లాంటును త్వరగా ఏర్పాటు చేయాలనీ కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News