వైఎస్సార్‌సీపీ కార్యాలయం అధికారిక ప్రకటన
రేపల్లెలో పార్టీ శ్రేణుల విజయోత్సాహం
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర (Ap) బీసీ విభాగ కార్యదర్శి(State BC Division Secretary)గా పీట నాగమోహన్‌కృష్ణ(Nagamohan Krishna) నియమితులయ్యారు. ఈయన బాపట్ల జిల్లా (Bapatla District) రేపల్లె (Repalle) శాసనసభ నియోజకవర్గానికి చెందిన నాయకుడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు (President) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ys JaganmohanReddy) ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.
పీటా నాగ మోహన్ కృష్ణ దీర్ఘకాలంగా వైఎస్సార్‌సీపీతో అనుబంధంగా ఉంటూ స్థానిక స్థాయిలో పార్టీ బలపరిచేందుకు విశేషంగా కృషి చేశారు. రేపల్లె నియోజకవర్గంలో బీసీ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వానికి, పార్టీ అధినాయకత్వానికి నిరంతరం తెలియజేస్తూ ప్రజలతో మమేకమై పని చేశారు. ఆయన తాలూకు నిబద్ధత, సామాజిక సమీకరణ దృక్పథం, పార్టీ పట్ల అంకితభావం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికాభివృద్ధి చర్యలకు ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా, బీసీ సమాజంలో రాజకీయ చైతన్యం పెంపొందించడం లో కూడా నాగ మోహన్ కృష్ణ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలతో పార్టీ రాష్ట్ర బీసీ విభాగ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకువెళ్లి, బీసీ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని నాగ మోహన్ కృష్ణ పేర్కొన్నారు. “వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాకారం కావడానికి నా వంతు కృషి చేస్తాను. బీసీ వర్గాల అభ్యున్నతి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నియామకంపై సంతోషం వ్యక్తం చేసారు . నియోజకవర్గం లో విజయోత్సవవాతావరణం నెలకొంది . ఈ సందర్భం గా వైస్సార్సీపీ కి చెందిన పలు నాయకులు, ప్రజా ప్రతినిధులు నాగ మోహన్ కృష్ణ కి శుభాకాంక్షలు తెలిపారు.


