Homeఆదాబ్ ప్రత్యేకంACP Mumtaz Begum | ఏసీపీ ముంతాజ్ బేగం రూటే సపరేటు..!

ACP Mumtaz Begum | ఏసీపీ ముంతాజ్ బేగం రూటే సపరేటు..!

  • డబ్బులు ఇస్తే చాలు ఏదైనా చేసేస్తుంది..
  • కోర్టులంటే లెక్కలేదు.. ప్రభుత్వ నిబంధనలపై సోయి లేదు..
  • ఈమె తలుచుకుంటే అక్రమాలు సక్రమమైపోతాయి..
  • ఎన్ని ఫిర్యాదులు వచ్చినా డోంట్ కేర్..
  • ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ రెండుచేతులా అక్రమార్జన..
  • ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తుండటంపై అనుమానాలు..
  • ఎవరెవరికి ఎంతెంత ముడుతున్నాయి..?
  • అనుమతులు రెండు.. నిర్మాణం ఒక్కటే..
  • జీ.హెచ్.ఎం.సి. మూసారాంభాగ్ సర్కిల్ – 29.. చార్మినార్ జోన్..
  • ఏసీపీ ముంతాజ్ బేగం కనుసన్నలలో అక్రమ నిర్మాణాలు..

జీ.హెచ్.ఎం.సి. చార్మినార్ జోన్, మూసారాంభాగ్ సర్కిల్ – 29లో ఓ అక్రమ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగు తోంది. ఈ అక్రమ నిర్మాణానికి ఏసీపీ ముంతాజ్ బేగం (ACP Mumtaz Begum)అండాదండాలున్నా యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలున్నా నిర్మాణం యధావిధి గా సాగుతోందంటే దానికి కారణం ఏసీపీ యే అని పలువురు అంటున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. హౌస్ నెం – 16-11-511/సి/10, ప్లాట్ నెంబర్ 10, వెస్ట్ పార్ట్.. హౌస్ నెం – 16-11-511/సి/10/ఏ, ప్లాట్ నెంబర్ 10, ఈస్ట్ పార్ట్..లో విడివిడిగా స్టీల్ట్ ఫర్ పార్కింగ్ ప్లస్ 2 పైఅంతస్తులకు అనుమతి ఉంది..

Moosarambagh Illegal Construction Allegations.1

కానీ ఈ రెండు పర్మిషన్లలను కలిపి అక్రమంగా 5 అంత స్తులు నిర్మిస్తున్నారు.. కాగా ఈ అక్రమ నిర్మాణంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హై కోర్టు (డబ్ల్యు పీ నెంబర్ : 27635 ఆఫ్ 2026) ఆదేశాలు జారీ చేసింది.. న్యాయస్థానం ఇచ్చి ఆదేశాలను అనుసరించి అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.. కానీ యథాతథంగా నిర్మాణం కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.. కాగా ఇక్కడ ఏసీబీ ముంతాజ్ బేగం(ACP Mumtaz Begum) ఒక సపరేటు రాజ్యాంగాన్ని నడిపిస్తోంది.. ఆమెకు అక్రమ సంపాదన తప్ప మిగతా ఏవీ అవసరం లేదనే విమర్శలు వస్తున్నాయి..(https://epaper.aadabhyderabad.in/Telangana%20Main?eid=1&edate=10/09/2026&pgid=39321&device=desktop&view=3)

- Advertisement -

ఆమెకు అమ్యామ్యాలు ముట్టజెపితే కోర్టు ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటూ ఆ ఆదేశాలను బుట్ట దాఖలు చేస్తుందని.. ప్రభుత్వ నియమ నిబంధనలు సైతం అటకెక్కిం చేస్తుందనే విమర్శలు సైతం ఉన్నాయి.. దానికి నిదర్శనమే ఇప్పుడు వెలుగు చూసిన భారీ అక్రమ నిర్మాణం.. ఈవిడ చేస్తున్న నిర్వాకంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.. కాగా ఉన్నతా ధికారులు సైతం ఆమె చేస్తున్న అవినీతిని పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి..

ఆమెను ఎవరూ కట్టడి చెయ్యడం లేదు.. దీని వెనుక ఉన్న మతలబు ఏంటి..? ఆమె ద్వారా అక్రమ సంపాదన ఎవరె వరికి చేరుతోంది..? ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.. అక్రమ నిర్మాణ దారుడు ఇంత బరితెగించి నిర్మాణాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు..? జీ.హెచ్.ఎం.సి. ఉన్నతా ధికారులు ఏమి చేస్తున్నారు..? సాక్షాధా రాలతో సహా అక్రమాలు వెలుగులోకి తీసుకుని వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధి కారులమీద లేదా..? జీ.హెచ్.ఎం.సి. మూసారాంభాగ్ సర్కిల్ – 29.. చార్మినార్ జోన్‌లో యథేచ్ఛగా జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణంపై మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగు లోకి తీసుకు రానుంది..

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News