Monday, June 1, 2026
Homeభక్తిMoney Plant | ఇంట్లో మనీప్లాంట్ ఉందా..?

Money Plant | ఇంట్లో మనీప్లాంట్ ఉందా..?

  • అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
  • పండితులు చెబుతున్న సలహాలు..

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే సంపద వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. అయితే, ఈ మొక్క ఆర్థిక శ్రేయస్సును చేకూర్చాలంటే దానిని పెంచడంలో కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య పండితులు, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ సరైన దిక్కున, సరైన పద్ధతిలో పెంచితేనే ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని.. ఇంట్లో మనశ్శాంతి లభిస్తుందని పేర్కొంటున్నారు. వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం..

మనీప్లాంట్ అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుందని.. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. అయితే.. మనీ ప్లాంట్ ను పెంచడానికి ఆగ్నేయం (వంటగది మూల), వాయువ్యం అనే రెండు దిక్కులు మాత్రమే అనుకూలమైనవి. ఈశాన్యం, నైరుతి లేదా ఇతర ఏ దిశలో పెంచినా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. తప్పుడు దిక్కులలో పెంచడం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మనీ ప్లాంట్ ను ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలలో మాత్రమే పెంచాలి.

- Advertisement -

మనీ ప్లాంట్ ను పెంచే విధానంలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీనిని ఎల్లప్పుడూ ఎర్రటి రంగు కుండీలో లేదా ఎర్రటి సీసాలో (నీటిలో పెంచినట్లయితే) పెట్టాలి. ఎర్రటి రంగు పాత్ర దాని శక్తిని మరింత పెంచుతుందని నమ్ముతారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనీ ప్లాంట్ కాండం ఎల్లప్పుడూ పైకి ఎదగాలి. దానిని ఆధారంగా పెట్టి పైకి పాకించాలి.

చాలామంది హ్యాంగింగ్ పాట్స్ లో పెంచి, మొక్క కిందకు వేలాడేలా చేస్తారు. అయితే, కిందకు వేలాడే విధంగా పెంచడం వల్ల ఆర్థిక నష్టాలు, దురదృష్టం కలుగుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. పైకి ఎదిగే మనీ ప్లాంట్ డబ్బును, అవకాశాలను ఆకర్షిస్తుందని, కిందకు వాలినది డబ్బును పడిపోయేలా చేస్తుందని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News