ఈ కాలం పిల్లలు కొందరు ఆరు
బయట ఆడుకోవడం లేదు
ఇసుక తిన్నెల్లో గుళ్ళు కట్టడం మరిచారు
ప్రాణం లేని బొమ్మల కోసం ఫోన్లను
తడుముతున్నారు
పుస్తకాలు పట్టి చదవడం లేదు
పుస్తకాల పురుగులు అసలే కారు
పుస్తకం పట్టకుండానే అన్నీ తెలుసంటారు
బంగారం లాంటి బాల్యాన్ని
పోగొట్టుకొంటున్నారు
ఉన్న పళంగా లేచారంటే స్మార్ట్ ఫోన్లకే అతుక్కుపోతున్నారు
ఆకలేస్తే అన్నం తినడం మరిచారు
చిరు తిండ్లు తింటూ
కడుపు నింపుతున్నారు
ఆకలి రుచి ఎరుగరు
నీళ్లతో కడుపు నింపి నిద్రపోతుంటారు
బడికి వెళ్ళమంటే బద్ధకం అంటారు
బడి బయట హాయిగా తిరుగుతుంటారు
అమ్మ అంటే అలుసుగా మాట్లాడుతుంటారు
నాన్నంటే లెక్కేలేకుండా ప్రవర్తిస్తారు
తమకు తామే హీరోలన్నట్టు ఫోజులిస్తుంటారు
పిచ్చుక గుళ్లను తలపై పెంచుతారు
పిచ్చి కట్టింగ్లను ప్రోత్సహిస్తారు
ఆడపిల్లలు కనిపిస్తే ఒరకంట చూస్తారు
అలుసిస్తే దగ్గరవుతారు
ఈ కాలం పిల్లలు
ఇగోలకు పోతుంటారు
జ్ఞానోదయం కలిగించే గురువుల మీద మరలబడుతుంటారు
ఈ కాలం పిల్లలు-చిచ్చర పిడుగులు
నేల మీద నిలబడి నింగిని తాకుతుంటారు
పగటి కలలు కంటు పనికి రాకుండా పోతున్నారు
భ్రమలో నుండి బయట కొస్తే
నిజ జీవితంలో నెగ్గుకోస్తారు!!
Childhood | ఈ కాలం పిల్లలు
- Advertisement -
