అలనాటి మేటి నటి, దివంగత కృష్ణవేణి(Krishnaveni) జీవిత చరిత్రను సీఎం చంద్రబాబు(CM Chandrababu) సచివాలయంలో ఆవిష్కరించారు. ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’(Mirzapuram Rani-Krishnaveni) అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ఈ బుక్ రాశారు. నటీమణి, గాయని, స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరంవారికి మార్గదర్శకంగా ఉంటుందని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాణి బ్రహ్మం, కొత్తపల్లి శ్రీధర్, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత సంతోషం వ్యక్తం చేశారు.
Book Launch | ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకావిష్కరణ
By Aadab Desk
- Advertisement -
Previous article
