HomeతెలంగాణYadagirigutta | స్వామివారి సన్నిధిలో మంత్రి సీతక్క

Yadagirigutta | స్వామివారి సన్నిధిలో మంత్రి సీతక్క

  • స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపిన మంత్రి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు,పూలమొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం గర్భాలయంలోని స్వయంభుమూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం,చిత్రపటాన్ని అందజేశారు.

- Advertisement -
Minister Seethakka Visits Yadagirigutta Temple

ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి తాసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, బిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News