Thursday, January 22, 2026
EPAPER
Homeనల్లగొండKomatireddy | R&B శాఖలోని అందరూ నా కుటుంబ సభ్యులే

Komatireddy | R&B శాఖలోని అందరూ నా కుటుంబ సభ్యులే

రోడ్లు & భవనాల శాఖ ఇంజినీర్లు(Engineers), అధికారులు(Officers), ఉద్యోగులు(Employees), కాంట్రాక్టింగ్ ఏజెన్సీ(Contracting Agency)లందరికీ మంత్రి(Minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Venkatreddy) హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా R&B క్యాలెండర్ & డైరీ(Calender and Dairy)–2026 ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం తనకు ఆనందంగా ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను పూర్తి చేసి, కొత్త నియామకాలు చేపట్టామని చెప్పారు. త్వరలో మిగిలిన ఖాళీల భర్తీ, సీనియారిటీ సమస్యల పరిష్కారం కూడా జరుగుతుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న “రైజింగ్ తెలంగాణ” నిర్మాణంలో మన శాఖ ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. R&B శాఖలో ప్రతిఒక్కరు తనకు కుటుంబ సభ్యులేనని, అందరూ నాణ్యత, నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News