Homeనల్లగొండPavitrotsavam | అంగరంగ వైభవంగా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పవిత్రోత్సవాలు

Pavitrotsavam | అంగరంగ వైభవంగా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పవిత్రోత్సవాలు

మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి భక్త ప్రహ్లాద సమేత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి పవిత్రోత్సవాలు(Pavitrotsavam) గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షగా నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలకు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

పవిత్రోత్సవాల(Pavitrotsavam) తొలిరోజు సందర్భంగా సాయంత్రం ఏడు గంటల నుంచి పూజా సూక్త పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ స్వామివారి అనుజ్ఞ స్వీకారం, విశ్వక్సేనారాధనపుణ్యాహవాచనం, అగ్నిదీపారాధన,పంచగవ్య ఆరాధన,ప్రాశనం, ఋత్విగ్వరణ, దీక్షారణ, రక్షాబంధనం, మేదినీ పూజ, మత్స్యగ్రహణం, అంకురారోపణ తదితర పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాజ్ఞిక నిర్వాహకులు ఆగమ ప్రవీణులు బొర్రా వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పవిత్రోత్సవ క్రతువులు ఘనంగా కొనసాగాయి.

- Advertisement -

ప్రత్యేక పూజలు,వైదిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక పరవశంలో భక్తులతో నిండిపోయింది.పవిత్రతోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.భక్తులకు అన్నదాన సత్రాల్లో ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.క్యూ లైన్లు,తాగు నీరు,పారిశుధ్యం,పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు విశ్రాంతి కొరకు సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రత కోసం పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

పవిత్రోత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకల కొరకు తెలంగాణలోని కోదాడ డిపోతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల,దాచేపల్లి నుండి మహాక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయ్ కుమార్,ఆలయ ప్రధాన అర్చకులు ముక్కుర్ శ్రీనివాసాచార్యులు,తూమాటి శ్రీనివాసాచార్యులు, తూమాటి కృష్ణమాచార్యులు, తూమాటి రామాచార్యులు,అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదిరినారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తితో పాటు ఆలయ సిబ్బంది,భక్తులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News