Homeక్రైమ్ వార్తలుTelangana DGP | దేవా సహా 20 మంది మావోల లొంగుబాటు

Telangana DGP | దేవా సహా 20 మంది మావోల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌కౌంటర్‌లో 12 మంది మృతి

మావోయిస్టు(Maoistr) కీలక నేత(Key Leader) బర్సె దేవా(Barse Deva) సహా 20 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(ShivadharReddy) ఎదుట శనివారం లొంగిపోయారు. దేవా.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) కమాండర్. ఈ గ్రూపు.. నిషేధిత సీపీఐ(CPI-మావోయిస్ట్)కి అత్యంత ప్రాణాంతకమైన సాయుధ విభాగం. మావోయిస్టుల ఏరివేత జరుగుతున్న సమయంలో పీఎల్‌జీఏ బెటాలియన్(Battalion) నంబర్-1 సభ్యుడు దేవా సరెండర్ కావటం చెప్పుకోదగ్గ విషయమని పోలీసులు పేర్కొన్నారు. దేవాతోపాటు తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్య సహా 20 మంది సభ్యులు కూడా లొంగిపోయారు. భారీగా ఆయుధాలను, రూ.20 లక్షల నగదును అప్పగించారు. సరెండర్ అయినవారు.. ఆవుల సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్యా, మంకు, అండా, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ ఎ.ఈశ్వరి ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో ఇవాళ మావోయిస్టులకు, సెక్యూరిటీ ఫోర్సెస్‌కి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల నుంచి భారీగా ఆయుధాలను సేకరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News