- ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే స్థాయికి క్రీడాకారులు ఎదగాలి ఎంపీడీవో శ్రీవాణి.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, బాటసింగారం గ్రామంలో అట్ట హాసంగా మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని, సీఎం కప్ వంటి క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకొని ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని ఎంపీడీవో శ్రీవాణి క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పిగ్లిపూర్, బాటసింగారం లో నిర్వహించిన రెండవ సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఆమె ఘనంగా ప్రారంభించారు.





ఈ పోటీల్లో అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బలిజగూడ, బండరవిరాల, బాటసింగారం, చిన్న రావిరాల, గండి చెరువు, గుంతపల్లి, ఇనంగూడ, జాఫర్‌గూడ, కవాడిపల్లి, లష్కర్ గూడ, మజీద్‌పూర్, పిగ్లిపూర్ తదితర గ్రామ పంచాయతీల నుంచి తుర్కయంజాల్, పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీల నుండి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, చెస్, క్యారమ్స్, యోగా వంటి విభిన్న క్రీడా పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీవాణి, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరరావు, ఎంఈఓ జగదీష్, ఎర్రవల్లి గౌరీశంకర్ (బాటసింగారం సర్పంచ్), ప్రభాకర్ రెడ్డి (పిగ్లిపూర్ సర్పంచ్), హేమలత జంగయ్య గౌడ్ (గుంతపల్లి సర్పంచ్), మేడిపల్లి ప్రియ చంద్రశేఖర్ (మజీద్‌పూర్ సర్పంచ్), మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ (అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్), ఉప్పు మాధవి నవీన్ (బలిజగూడ సర్పంచ్), పబ్బతి బాల కిషన్ (చిన్న రావిరాల సర్పంచ్), కొలను ప్రసన్న లక్ష్మీ రవీందర్ రెడ్డి ( కావాడిపల్లి సర్పంచ్) కందికంటి విజయ్ ( బండరావిరాల సర్పంచ్), దేశారం రాఘవేందర్( ఇనామ్ గూడ సర్పంచ్), రాచపాక నవనీత మహేష్ (అనాజ్ పూర్ సర్పంచ్), నార్లకొండ వెంకటేష్ (బాటసింగారం ఫిజికల్ డైరెక్టర్), కళాశాల ప్రిన్సిపాల్ రూబీ గారు, వేణుగోపాల్, సిబ్బంది, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
