Homeనల్లగొండInauguration | చలివేంద్రం ఏర్పాటు…

Inauguration | చలివేంద్రం ఏర్పాటు…

  • స్వర్గీయ మాజీ ఎంపీపీ బొల్లం బిక్షపతి సేవలు చిరస్మరణీయం…
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి…
  • మాజీ జెడ్పిటిసి సభ్యులు బొల్లం అజయ్ మణికంఠ….

వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో గాల టోల్గేట్ సమీపంలో సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని చలివేంద్రాన్ని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. జనగామ జిల్లా మాజీ జడ్పీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు బొల్లం అజయ్ మణికంఠ ప్రారంభించారు… మాజీ ఎంపీపీ స్వర్గీయ బొల్లం బిక్షపతి స్మారకరాకర్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు.

Free Drinking Water Chalivendram Inaugurated on Hyderabad Warangal Highway 1

చలివేంద్రం ఏర్పాటు చేసి తమ ఉదాసీనతను బొల్లం కుటుంబం చాటుకుంది. పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రతిరోజు ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు.. త్వరలో బిక్షపతి.. పేరుతో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రఘునాధపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ముసుపట్ల విజయ్, మండల యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, వెల్ది ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజ్, బాల్నే పరుశురాం,పేర్ని ప్రసాద్, పేర్ని లెనిన్, కరీంకొండ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News