Homeమహబూబ్‌నగర్‌Complaint | అక్రమ రేషన్ కార్డు వినియోగం పై కలెక్టర్, డీఈఓ కు ఫిర్యాదు.

Complaint | అక్రమ రేషన్ కార్డు వినియోగం పై కలెక్టర్, డీఈఓ కు ఫిర్యాదు.

జిల్లా కేంద్రంలో విద్యాశాఖ లో టీచర్ ఉద్యోగం చేస్తూ.. అధికారులను తప్పుదోవ పట్టిస్తు అక్రమంగా రేషన్ కార్డును వినియోగిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదాంతానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కు జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ ఘనీ కి మహమ్మద్ ఖలీల్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి పట్టణంలో రాంనగర్ లో నివసిస్తున్న సిల్మర్తి అంజనేయులు అనే వ్యక్తి భార్య మదనపురం మండలం దుప్పల్లి గ్రామంలో ఉపాధ్యాయురాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ…

ప్రభుత్వానికి సంబంధించిన బెనిఫిషర్ ని పొందుతూ, కొన్ని ఏళ్ల పాటుగా అక్రమ రేషన్ కార్డు ను వినియోగిస్తూ… అధికారులను, సభ్య సమాజాన్ని ప్రత్యక్షంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలకు రావాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అన్నీ తెలిసి మోసం చేస్తుండడం అత్యంత బాధాకరమన్నారు. సమాజంలో ఆయన కూడా ఓ వృత్తిపరంగా జర్నలిస్టుగా, ప్రైవేటు ఉద్యోగిగా చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ…

- Advertisement -
Complaint Filed Over Illegal Ration Card Misuse in District Education Case

ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేయడం సరైనది కాదన్నారు. ఇట్టి విషయంపై ఫిర్యాదారుడు జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారికి, ఎమ్మార్వోకు, అలాగే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారులు సరైన విచారణ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News