ఐదు రోజుల కిందటే సోదరుడి మరణం
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో ఐదు రోజుల వ్యవధిలోనే మరోసారి విషాదం (Tragedy) చోటుచేసుకుంది. రాత్రి ఓ వ్యక్తి విద్యుదాఘాతం(Current Shock)తో చనిపోయాడు. మృతుణ్ని తాళ్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. ఆయన వయసు 52 ఏళ్లు. శ్రీనివాస్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి ఆవరణలోని ఇనప మెట్ల(Iron Steps)పై కూర్చొని ఉండగా కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. కరెంట్ మీటర్ సర్వీస్ వైర్ (Service Wire) మెట్ల మీద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ సోదరుడు కూడా ఐదు రోజుల కిందటే మరణించటం, ఇంట్లో ఖర్మ జరిగిన రోజే మరొకర్ని అకాల మృత్యువు వెంటాడటంతో ఆ కుటుంబంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
