Homeహైదరాబాద్‌Gold Theft | పనిచేసిన ఇంటికే కన్నం పెట్టిన కిలాడి లేడీ అరెస్ట్

Gold Theft | పనిచేసిన ఇంటికే కన్నం పెట్టిన కిలాడి లేడీ అరెస్ట్

  • హబ్సిగూడ బస్‌స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 95.4 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం

వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ బంగారు నగలు దొంగిలించిన మహిళను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితురాలి నుంచి సుమారు రూ.3.88 లక్షల విలువైన 95.4 గ్రాముల బంగారు ఆభరణాలు,రూ.8,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీ.ఐ.మహేష్ గౌడ్ తో కలిసి ఓ.యూ డివిజన్ ఏ.సి.పి.జగన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.నిందితురాలు గతంలో కిరాణా షాపు నిర్వహించి నష్టపోవడంతో భారీగా అప్పులపాలైంది.

Maid Arrested In Habsiguda Gold Theft Case1

ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది.జూన్ 2025లో సునీత అనే మహిళ ద్వారా హబ్సిగూడలోని డాక్టర్ రావు ఇంట్లో నెలకు రూ.18,000/- జీతానికి కేర్‌టేకర్‌గా చేరింది.దంపతుల నమ్మకాన్ని సంపాదించిన ఆమె,అక్టోబర్ 2025 నుండి ఫిబ్రవరి 23, 2026 మధ్య కాలంలో ఇల్లు మరియు బెడ్‌రూమ్ శుభ్రం చేసే నెపంతో అలమరలో ఉన్న బంగారు గొలుసులు,గాజులు,ఉంగరాలు మరియు చంద్రహారాన్ని విడతల వారీగా దొంగిలించిందని తెలిపారు.ఫిబ్రవరి 25న ఉదయం 07:30 గంటల సమయంలో హబ్సిగూడ బస్ స్టాప్ వద్ద నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
Maid Arrested In Habsiguda Gold Theft Case

విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.దొంగిలించిన మొత్తం సొత్తును పోలీసులు రికవరీ చేశారు.నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.ఈ కేసు చేదనలో నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం ఇబ్బందికి ఏసిపి జగన్ రివార్డులు అందజేశారు.మీడియా సమావేశంలో ఎస్సై కరుణాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News