Homeఆదిలాబాద్MCPI (U) | ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు..

MCPI (U) | ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు..

  • ఈ సభను జయప్రదం చేయాలని పిలుపు..

బెల్లంపల్లి పట్టణం లో శుక్రవారం యంసిపిఐ(యు) జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయకార్యదర్శి పసులేటి వెంకటేష్ పిలుపు ఈనెల 12న వరంగల్ జిల్లా నర్సంపేటలో జరుగుతున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ శాసనసభ్యులు యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభ ను జయప్రదం చేయాలని యంసిపిఐ(యు) జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని యంసిపిఐ(యు)పార్టీ అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ…

2025 మే 12 నుండి 2026 మే 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్ ఓంకార్ అనుసరించి పోరాడిన అనేక అంశాలలో నెలకు ఒక అంశాన్ని ప్రజలలో ముందు ఉంచుతూ సంవత్సర కాలం పాటు ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేత పట్టి ఆనాటి నిజాం రజాకార్లకు, దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ అని అన్నారు.

- Advertisement -
Maddikayala Omkar Centenary Closing Meeting In Narsampet

ఐదు సార్లు రాష్ట్ర శాసనసభకు నర్సంపేట నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గలం వినిపించి ప్రజలచే అసెంబ్లీ టైగర్ అనిపించిన గొప్ప నాయకుడని ఈ దేశంలో కుల మత ప్రాంతీయ దోపిడీ ఆర్థిక అసమానతలు లేని సమాజం రావాలని తప్పించి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కమ్యూనిస్టు నాయకునిగా ప్రజలకు సేవలు అందించాలని ప్రజల పక్షాన నుండి సమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులు అందరూ ఐక్యం కావాలని, కుల అసమానతలతో వివక్ష ఎదుర్కొంటున్న అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం తపించారని గుర్తు చేశారు.

కమ్యూనిస్టుల సామాజిక శక్తుల ఐక్యత ఓంకార్ పాత్ర అనే అంశం మీద ఈ ముగింపు సభ జరుగుతుందని అన్నారు. వామపక్ష సామాజిక శక్తులు ఇప్పటికైనా ఈ దోపిడి వ్యవస్థ మీద పోరాడేందుకు ఐక్యం కావాలని కోరినారు.అన్ని వర్గాల ప్రజలు తమ తోడ్పాటు అందించి,హాజరై జయప్రదం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు)పార్టీ పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్,నాయకులు రమేష్, వంశీ,,పసులేటి సాయి హర్షిత్, అనన్య,అమర్త్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News