Thursday, January 22, 2026
EPAPER
Homeనల్లగొండCondolences | ఎం.ఎన్.రెడ్డికి నేతల సంతాపం

Condolences | ఎం.ఎన్.రెడ్డికి నేతల సంతాపం

చిట్యాల పట్టణానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ముప్ప నర్సింహా రెడ్డి (యం.యన్.రెడ్డి) అనారోగ్యం కారణంగా మరణించడం పట్ల పలువురు నేతలు పరామర్శించారు. వారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నకరికల్లు మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య లు తీవ్ర సంతాపం తెలిపారు.

చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం నాడు ఆయన మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ కు చైర్మన్ గా యం.యన్ రెడ్డి సేవలు మరువలేనివి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు పోకల దేవదాస్, వనం వెంకటేశ్వర్లు, జడల చిన్న మల్లయ్య,బొబ్బిలి శివశంకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం , నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News