Tuesday, March 3, 2026
HomeతెలంగాణKTR | దమ్ముంటే.. చర్చకు రా..!

KTR | దమ్ముంటే.. చర్చకు రా..!

  • ఎవరి హయాంలో ఏం చేశామో ప్రజల ముందు నేరుగా వివరిద్దాం
  • చెత్త ఎవరిది.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం
  • సీఎం రేవంత్కు సవాల్ విసిరిన కేటీఆర్
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని వెల్లడి

హైదరాబాద్ 1 అభివృద్ధిపై అధికారపక్షం ప్రతి పక్షాల మాటల దాడులు, రాజకీయ సవాళ్లు మరింతగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. “హైదరాబాద్ అభివృద్ధిపై నాతో చర్చకు రావాలి” అని కేటీఆర్ నేరుగా సీఎం రేవంత్ ని సవాల్ చేసారు. అసెంబ్లీ కావచ్చు, సచివాలయం కావచ్చు లేదా గాంధీభవన్ కావచ్చు – ఎక్కడైనా సరే, ప్రజల ముందే చర్చిద్దామన్నారు.

అయితే కేటీఆర్ విమర్శల ధోరణి చూస్తుంటే మాత్రం ఇది సాధారణ రాజకీయ ప్రసంగం కాదు రేవంత్రెడ్డిపై నేరుగా కౌంటర్ అనే మాటలే రాజకీయ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి ఈ నెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్ కు ఇప్పటికె అర్థమైందని కేటీఆర్ అన్నారు. అందుకే ఆయన వ్యక్తిగత దూషణలకు దిగారని కేటీఆర్ మండిపడ్డారు. తాను కూడా బలంగా మాట్లాడగలనని కానీ తమ అధినేత కేసీఆర్ ఇచ్చిన సూచనల ప్రకారం ఆ స్థాయికి తాను కూడా దిగజారి మాట్లాడానని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

“మేము చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పమన్నది మాత్రమే కేసీఆర్ ఆదేశం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాము చేసిన అభివృద్ధిని, అంకెలతో నిరూపించగలనని కేటీఆర్, సిఎం రేవంత్ నుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి రూ.5,328 కోట్లు ఖర్చు చేశామని, మెట్రో రైలు ప్రాజెక్టుపై రూ.1,722 కోట్లు వెచ్చించామని తెలిపారు. షేక్పేట్ ఫ్లైఓవర్ను రూ.333 కోట్లతో నిర్మించామని, ఎర్రగడ్డలో రూ.900 కోట్లతో టిమ్స్ ఆసుపత్రిని కట్టామని గుర్తుచేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని, రెహ్మత్నగర్లో 3,600 ఇళ్లు పంపిణీ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాదు క్లీన్ సిటీగా మారిందని, రేవంత్ హయాంలో మాత్రం. మురికికూపంగా తయారైందని విమర్శించారు. “కాంగ్రెస్ హయాంలో చెత్త సిటీ, క్రైమ్ సిటీగా హైదరాబాద్ మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో మేము “గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్”గా మార్చాం” అని గర్వంగా చెప్పారు కేటీఆర్ విద్యుత్ సరఫరాలో కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, పవర్ హాలీడేలు కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని గుర్తు చేశారు.

అలాగే, హెూమ్ మంత్రిత్వ శాఖను చూసే రేవంత్రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలుఘోరంగా క్షీణించాయని తీవ్ర విమర్శలు చేశారు. “గన్ కల్చర్, డ్రగ్ కల్చర్ పెరిగింది. మహారాష్ట్ర పోలీసులు వచ్చి డ్రగ్ దందా పట్టుకున్నారు. 12 వేల డ్రగ్స్ దొరికినా ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన లేదు” అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బెదిరింపుల వల్ల పరిశ్రమలు రాష్ట్రం వదిలిపోతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లో తాగునీటి సమస్య మళ్లీ తలెత్తిందని కేటీఆర్ అన్నారు. “రేవంత్ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలైనా పూడ్చిందా?” అంటూ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో 100 లింక్ రోడ్లు నిర్మించామని, కొత్త ప్రభుత్వం ఒక్క ఫ్లై ఓవర్ కూడా కట్టలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమంపై కూడా కేటీఆర్ గణాంకాలు చూపించారు ఆసరా, కల్యాణలక్ష్మి కింద రూ.600 కోట్లు, దళితబంధు కింద 106 మందికి ప్రయోజనం, 204 మైనారిటీ గురుకులాల కోసం రూ.51 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పాఠశాల మౌలిక సదుపాయాలకు రూ.87 కోట్లు, ఫంక్షన్ హాలులకు రూ.17 కోట్లు, విద్యుత్ సబ్ స్టేషన్లకు రూ.455 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

ఇంతవరకు తాము చేసిన పనులను ప్రాజెక్టు వారీగా ప్రజలకు చూపిస్తున్నామన్న కేటీఆర్, “రేవంత్ రెండు ఏళ్లలో ఏం చేశారో చెప్పండి” అని సవాల్ విసిరారు. స్వచ్ సర్వేక్షణ్ కేసీఆర్ పాలనలో 34 అవార్డులు వచ్చాయని, రేవంత్ పాలనలో ఎన్ని వచ్చాయో చెప్పమన్నారు. జూబిలీహిల్స్ ఎన్నికలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ న్యాయనిర్ణేతలు – జూబ్లీహిల్స్ ఓటర్లు సరైన జవాబిస్తారు” అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ నేపధ్యం లో రేవంత్ కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తారా? హైదరాబాదు అభివృద్ధిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలవుతుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “ప్రజలే

- Advertisement -
RELATED ARTICLES

Latest News