Wednesday, April 15, 2026
Homeభక్తిAkshaya Tritiya | భార్య భర్తల మధ్య అనుబంధానికి అక్షయ..

Akshaya Tritiya | భార్య భర్తల మధ్య అనుబంధానికి అక్షయ..

  • అందరికీ మంచి జరుగుతుందని శాస్త్రం..

అక్షయ తృతీయను హిందూ సంప్రదాయంలో ప్రత్యేకంగా భావిస్తారు. ఎందుకంటే, ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ ఏప్రిల్ 19న ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. వందేళ్ళ తర్వాత ఇవి కదలడంతో శుభయోగాలు ఏర్పడనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈసారి అక్షయ తృతీయ రోజున మాలవ్య యోగం, అక్షయ యోగం, గజకేసరి యోగం వంటి మూడు ముఖ్యమైన యోగాలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇవి ఇలా కలవడ చాలా అరుదు అని చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశుల వారిమీద పడుతుంది.

వాటిలో రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది. అక్షయ తృతీయ రోజు నుంచి తులా రాశి వారిని ఎవరూ ఆపలేరు. అనుకున్నవన్ని సాధిస్తారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా సమాజంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి మేష రాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరుగుతుంది. ఇంకా చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విడాకుల తీసుకోవాలనే భార్య భర్తల నిర్ణయాలు కూడా మారతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News