- రైతుల తరఫున ఆందోళన చేపట్టిన కవిత..
- కలెక్టర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆందోళ కొనసాగింపు..
రైతుల సమస్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వికారాబాద్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వికారాబాద్ కలెక్టర్ కు కవిత స్పష్టం చేశారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కారణంగా భూములు కోల్పోతున్న రైతుల బాధలను స్వయంగా వారి వద్దకు వెళ్లి వినాలని ఆమె కలెక్టర్ ను కోరారు.


రైతుల ఆందోళనకు మద్దతుగా ధర్నాకు దిగిన కవితకు నచ్చచెప్పేందుకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన కలెక్టర్. రైతులకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టం చేసిన కవిత. రైతులతో ఆర్డీవోను మాట్లాడిస్తామని చెప్పిన కలెక్టర్. నో చెప్పిన కవిత. స్వయంగా మీరే వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంలో కలెక్టరో సమాధానం దాటవేశారు.. కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవటంతో ఆందోళన కొనసాగించింది కవిత.


