Homeసినిమా"Destiny" | డైరెక్టర్ నందినీ రెడ్డి లాంచ్ చేసిన ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్

“Destiny” | డైరెక్టర్ నందినీ రెడ్డి లాంచ్ చేసిన ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’.(Destiny) ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’(Destiny) టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

- Advertisement -

ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

*తారాగణం* : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు

*సాంకేతిక బృందం:*

కథ-స్క్రీప్లే- డైలాగ్స్ – దర్శకత్వం – చెందు ముద్దు
నిర్మాత: దినేష్ కుర్ర
బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్
సమర్పణ : కె. రాఘవేంద్ర రెడ్డి
DOP: పంకజ్ తొట్టాడ
ఎడిటర్: డి వెంకట ప్రభు
సంగీతం: మారుతీ రాజా
ప్రాజెక్ట్ ప్రణాళిక & రూపకల్పన: చంద్రహాస్ కోట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర బాలాజీ
పబ్లిసిటీ డిజైన్స్: ఎ డిజైన్ ఫ్యాక్టరీ
PRO: సాయి సతీష్

- Advertisement -
RELATED ARTICLES

Latest News