Thursday, June 18, 2026
Homeస్పోర్ట్స్IPL 2027 | కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ..

IPL 2027 | కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ..

  • 2027లో ముందుచూపుతో వ్యవహరించాలని నిర్ణయం..
  • హింట్ ఇచ్చిన సెక్రటరీ దేవాజిత్ సైకియా..

వేస‌విలో క్రీడా వినోదం పంచే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ విష‌యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి కీల‌క నిర్ణ‌యానికి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌తి సీజ‌న్‌ను మార్చి నెలాఖ‌రులో ప్రారంభించే బీసీసీఐ.. 2027 ఎడిష‌న్ విష‌యంలో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటోంది. సీజ‌న్ మ‌ధ్య‌లో మండు టెండ‌లు, అకాల వ‌ర్షాల‌తో త‌లెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఐపీఎల్ 2027ను కాస్త ముందుగానే జ‌ర‌పాల‌ని భావిస్తోంది.

ఈ విష‌య‌మై ఐపీఎల్ వ‌చ్చే సీజ‌న్ షెడ్యూల్‌పై గురువారం బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా హింట్ ఇచ్చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2027ను ముందుగానే మొద‌లెట్టాని బీసీసీఐ భావిస్తోంది. సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా ఇదే అంశంపై మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 29(28) వ తేదీన ప్రారంభ‌మైంది. అయితే.. మే రెండో వారం టోర్నీ స‌మ‌యంలో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ముందుస్తు వాన‌ల కార‌ణంగా టోర్నీకి అంత‌రాయం క‌లుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News