- ఎలాంటి ఓపెనింగ్ జర్మనీ ఉండదు..
- బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్..
- వివరాలు తెలిపిన బీసీసీఐ అధికారులు..
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్, బెంగుళూరు జట్ల మధ్య తొలి ఫైట్ జరగనున్నది. ఇక గత ఏడాది విక్టరీ పరేడ్ సమయంలో పెను విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ జట్టు ర్యాలీకి వేల సంఖ్యలో జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అభిమానుల స్మృతికి నివాళిగా ఈసారి ప్రారంభం వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
సాంస్కృతిక, వినోద వేడుకలను చేపట్టడం లేదని ఆ అధికారి చెప్పారు. కానీ ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ కోసం మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఘనంగా క్లోజింగ్ సంబరాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు ఓ మీడియా తన కథనంలో రాసింది. 2025లో కోల్‌కతాలో ఓపెనింగ్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు. షారూక్ ఖాన్, శ్రేయాస్ ఘోషల్, కరన్ అజులా ఆ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
