12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని ఫ్లవర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ హాజరయ్యారు.
హఠయోగ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ యోగ గురువు శంకరాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ సీఐ సైదులు, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి, జవహర్ నగర్ మాజీ తొలి మేయర్ మేకల కావ్య, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాషవోని కొండల్ ముదిరాజ్, బీజేపీ పార్టీ అధ్యకు కమల్ చారి, తో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, ఝాన్సీ సరస్వతి విజ్ఞానికేతన్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని వక్తలు సూచించారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.
