Homeరంగారెడ్డిBandaraviryal | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Bandaraviryal | ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బండరావిరాల గ్రామంలో సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, పాలకవర్గం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

International Womens Day Celebrations In Bandaraviryal2

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా అబ్దుల్లాపూర్ మెట్ మండల ఎంపీడీఓ శ్రీవాణి, SI ప్రియాంక రెడ్డి, హెల్త్ ఆఫీసర్ ప్రియాంక పాల్గొన్నారు. వారు ప్రసంగిస్తూ మహిళా సాధికారత ఉన్న చోట సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒక పురుషుడు చదువుకుంటే ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం కావచ్చు, కానీ ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబమే విద్యావంతులవుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళలను గౌరవించడం చాలా సంతోషకరమన్నారు.

- Advertisement -
International Womens Day Celebrations In Bandaraviryal3

ఈ కార్యక్రమము లో పాల్గొన్న అధికారులు మండల మెడికల్ ఆఫీసర్ డా.ప్రియాంక, ICDS సూపర్వైసర్ వనజ, SERP CC సుశీల, ZPHS వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి సబ్ సెంటర్ ఇంచార్జ్ డా శ్రేయ, ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, గ్రామ వార్డు సభ్యులు కన్నె భరత్ యాదవ్, యేడవల్లి సుస్మిత రమేష్, ఏప్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, గుండ్ల భవాని శివ ముదిరాజ్, కొత్త అరుణ్ కుమార్ గౌడ్, కోదాసు మణెమ్మ, కందికంటి నర్సింగ్ రావు, నేముర గోముల మహేష్, మహిళా సంఘాల నాయకులు, ఆశా వర్కర్స్, గుండోజి రంగదాస్ ట్యూషన్ టీచర్స్, సిబ్బంది, అంగన్ వాడి టీచర్స్, ప్రభుత్వ పాఠశాల టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News