భారతదేశ తొలి మహిళ ప్రధానిగా అనేక సంస్కరణలను అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిన ధీర వనిత ఇందిరా గాంధీ అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హాఫీజుద్దీన్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని మినీ గాంధీ భవన్ లో శుక్రవారం దివంగత ప్రధాని,ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 41 వ వర్ధంతిని పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడతూ గరిభి హటావో నినాదంతో పేదలకు కనీస అవసరాలైన కూడు,గూడు,గుడ్డ కల్పించి,రాజ భరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాకే దక్కిందన్నారు.
ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఆమె ఆశయాలు కోనసాగాలంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన అవసరం ఉందని హఫీజుద్ధిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సిడిసి చైర్మన్ యరబొలు సూర్యనారాయణ రెడ్డి,కొరివి వెంకటరత్నం,బెల్లంకొండ వెంకన్న,బానోత్ పీర్యా నాయక్,బానోత్ బొంగా నాయక్,సురేందర్ రెడ్డి,శివాలయం చైర్మన్ రేలా ప్రదీప్ రెడ్డి,గుండా భూపాల్ రెడ్డి,బుచ్చి రెడ్డి,శివారెడ్డి,లింగా రెడ్డి,కందుల వెంకన్న,బెల్లంకొండ కిరణ్, షేక్ నాగుల్ మీరా,షేక్ హుస్సేన్,దామల్ల పాపారావు,తదితరులు పాల్గొన్నారు.
