Homeనల్లగొండHuzurnagar Tahsildar | హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా బాశెట్టి హరి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

Huzurnagar Tahsildar | హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా బాశెట్టి హరి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ తహసీల్దార్ (Huzurnagar Tahsildar) (ఎఫ్‌ఏసీ)గా బాశెట్టి హరి ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (డీఏఓ)గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హుజూర్‌నగర్ తహసీల్దార్‌గా నియమితులయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడమే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు నూతన తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News