డిసెంబర్‌లో ఇండియా(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరగాల్సిన లిమిటెడ్ ఓవర్ల సిరీస్ (Limited Overs Series) పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు మరణ శిక్ష (Death Penalty) పడిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఉమెన్ టీమ్ (Women Team) ఇండియాలో 3 వన్డేలు, 3టీ20లు ఆడాల్సి ఉంది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ICC Future Tours Program)లో భాగంగా ఈ సిరీస్‌కు ప్లాన్ చేశారు. అయితే తేదీలు ఇంకా ఫైనల్ కాలేదు. వేదికలు మాత్రం కోల్‌కతా, కటక్ అని అనుకుంటున్నారు. అయితే.. ఈ సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఉండటంతో ప్రత్యామ్నాయంగా మరో సిరీస్ ఏర్పాటు కోసం బీసీసీఐ (Bcci) ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Postpone | ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా!
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
