Tuesday, November 11, 2025
ePaper
Homeస్పోర్ట్స్Cancell | ఇండియా-ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు

Cancell | ఇండియా-ఆస్ట్రేలియా తొలి టీ20 రద్దు

ఇండియా-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య జరుగుతున్న తొలి టీ20 రద్దయింది. తొలుత వాన (Rain) వల్ల మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాన ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు (Cancell) చేస్తున్నట్లు అంపైర్లు (Umpires) ప్రకటించారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి టీమిండియా 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. మొదట టాస్ (Toss) గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ (Bowling) ఎంచుకుంది. అభిషేక్ శర్మ 19 రన్నులు చేసి ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ 37 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 39 రన్నులతో నాటౌట్‌గా నిలిచారు. రెండో టీ20ని మెల్‌బోర్న్(Melbourne) వేదికగా శుక్రవారం(అక్టోబర్ 31న) నిర్వహించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News