Wednesday, March 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBRS Party| మూల్యం తప్పదు!!

BRS Party| మూల్యం తప్పదు!!

బీఆర్ఎస్ పార్టీని చక్క దిద్దుకోకపోతే మూల్యం తప్పదు..

  • పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్కు ‘స్థానిక ఎన్నికల’ సవాల్
  • గెలిచిన ఎమ్మెల్యేలు జంప్.. గ్రౌండ్లో బలహీనంగా ఉన్న పార్టీ
  • కమిటీలే లేవు.. క్యాడర్కు ఇది.. అది చేయమనే దిక్కులేదు..
  • సభ్యత్వ నమోదును అడిగే నాధుడు లేదు.. పార్టీ పటిష్టతపై నీలినీడలు
  • ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో గులాబీ ఖాళీ.. క్యాడర్ కు దిక్కుతోచని స్థితి
  • పెద్దోళ్లంతా సీఎం ను,ప్రభుత్వాన్ని ఏకరువుపెట్టే పనిలో నిమగ్నం …
  • మళ్లీ రేసులోకి రావాలంటే, బీఆర్ఎస్కు మొదటి టాస్క్… గ్రామ కమిటీలే ..

-స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు సాధారణ

- Advertisement -

రాజకీయ పోరాటం కావు.. గత రెండు దశాబ్దాలుగా అల్లుకున్న పార్టీ బలాన్ని తిరిగి కూడగట్టుకునే అగ్నిపరీక్ష. పదేళ్ల నిరంతర హస్తం తర్వాత ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి జారిన గులాబీదళం.. ఇప్పుడు సంస్థాగత శూన్యత, జంపింగ్ నాయకుల దెబ్బ, గ్రామస్థాయి నాయకత్వం క్షీణత వంటి అంతర్గత సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది.. రాష్ట్రస్థాయిలో ఇంకా సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. గ్రామాల్లో పార్టీ వేళ్లు బలహీనపడుతున్నాయన్న భయాలు బీఆర్ఎస్ కు మరింత కీలకంగా మారాయి..

-బీఆర్ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల సవాల్..


2001లో ఆవిర్భవించిన క్షణం నుంచి స్థానిక ఎన్నికలతో మొదటి విజయాలను సొంతం చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో బలమైన పునాది వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ… ఈసారి అదే స్థానిక సంస్థల ఎన్నికల ముందు గట్టిసవాల్ను ఎదుర్కొంటోంది. పదేళ్ల అధికారం చేజారిన తరువాత ప్రతిపక్షంలోకి వచ్చిన కారు పార్టీ, ఓటమి షాక్ నుంచి కోలుకుంటూ రాష్ట్రస్థాయిలో దూకుడును ప్రదర్శిస్తున్నప్పటికీ ..రూరల్ పాలిటిక్స్లో లో మాత్రం అదే ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతుందన్న అభిప్రాయం బలంగా వినబడుతోంది..

  • గ్రామ స్థాయిలో నాయకత్వం ఖాళీ ..
    ఇంతకాలం అధికారంలో ఉన్న అనుభవమే బీఆర్ఎస్కు స్థానిక రాజకీయాల్లో బలం. కానీ ఆ బలమే క్రమంగా సన్నగిల్లిపోతుంటే క్యాడర్ కు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది .. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్ లోకి జంప్ కావడం, మరో రెండు స్థానాలు బైపోల్స్లో కాంగ్రెస్కి వెళ్లిపోవడంతో గులాబీ పార్టీ శాసనబలం 27కు పరిమితమైంది. ఈ 27 నియోజకవర్గాల్లోనైనా పంచాయతీ ఎన్నికల్లో పోరాటం గట్టిగా ఉండొచ్చని అంచనాలు ఉన్నా… మిగతా నియోజకవర్గాల్లో మాత్రం దిశానిర్దేశం చేసే నాయకత్వమే కనిపించడం లేదని కారు క్యాడర్లో అసహనం పెరుగుతోంది.
    ఎమ్మెల్యేలేని నియోజకవర్గాల్లో, జంపింగ్ నాయకులు ఉన్న ప్రాంతాల్లో.. పార్టీకి దిక్కెవరు? అనే ప్రశ్న పెద్దదిగా మారింది. నియోజకవర్గ ఇంచార్జ్లలో చాలామంది యాక్టీవ్ లేకపోవడం, కొందరు తమ నియోజకవర్గాలను వదిలేసి ప్రధాన నేతల వెంట తిరుగుతున్నందు వల్ల గ్రామస్థాయి కార్యకర్తలు పూర్తిగా అనాథలయ్యారనే టాక్ బలపడుతోంది.

సంస్థాగత నిర్మాణం ఎక్కడ..?

2017 మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికీ యథాతథంగా ఉండటం, 2022లో 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించినప్పటికీ… పూర్తి స్థాయి జిల్లా, మండల, గ్రామ కమిటీల ఏర్పాటు జరగకపోవడం పార్టీ దుర్బలతను మరింత పెంచింది. ఏడేళ్ల క్రితం జిల్లా కమిటీలను రద్దు చేసి పార్లమెంట్ నియోజకవర్గాలపై రాష్ట్ర కార్యదర్శుల వ్యవస్థను అమలు చేసినప్పటి నుంచి పార్టీ అంతర్గత శ్రేణుల్లోనే అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్యేలకు అన్ని అధికారాలు అప్పగించడంతో… పార్టీ నిర్ణయాలు ఆ వ్యక్తిపైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది.

  • సభ్యత్వ నమోదు.. ప్రకటనలే తప్ప అమలులో లేదు

కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు తక్షణమే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం అని చెప్పినప్పటికీ… ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పదవులు లేక, కమిటీలలో చోటు లేక… చాలా మంది పాత నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని పార్టీ అంతర్గత నివేదికలే చెబుతున్నాయి.

– సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ?


గ్రామస్థాయిలో పార్టీ బలహీనత ఇప్పుడు ప్రత్యక్షంగా సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
అధికారంలో లేని పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్ ఉండదన్న వాస్తవం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి, నాయకత్వ ఖాళీలు, సంస్థాగత బలహీనతలు..బీఆర్ఎస్అభ్యర్థుల విజయావకా శాలపై స్పష్టమైన మబ్బుల్లా మారాయి.

– పార్టీ భవిష్యత్తు..

సంస్థాగత పునర్నిర్మాణంపైనే ఆధారపడి ఉంది
బీఆర్ఎస్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే… గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంస్థాగత నిర్మాణం తప్పనిసరి. గతంలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా స్థాయి నాయకత్వం.. ప్రస్తుతం తలోదిక్కుకు నెట్టివేయ బడ్డారు..ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కమిటీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకపోతే… జడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఇదే ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News