Homeహైదరాబాద్‌36-Hour Water Cut | నవంబర్ 3 నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు...

36-Hour Water Cut | నవంబర్ 3 నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం!

  • గండిపేట కాండ్యూట్‌లో భారీ లీకేజీలు.. మరమ్మతులకు జలమండలి చర్యలు

హైదరాబాద్: హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి కీలక సూచన చేసింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్‌లోని సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద భారీ లీకేజీలు ఏర్పడటంతో వాటిని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ పనులు నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. మొత్తం 36 గంటల పాటు(36-Hour Water Cut) ఈ పనులు జరగనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ప్రభావిత ప్రాంతాలు ఇవే..

గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13): రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ.

- Advertisement -
  • గోల్కొండ జోన్ (డివిజన్-14): చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్.
  • కవాడిగూడ సర్కిల్ (డివిజన్-17): కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ తదితర ప్రాంతాలు.
  • జూబ్లీహిల్స్ సర్కిల్ (డివిజన్-15): బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాలు.

మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందస్తుగా తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News