Thursday, May 7, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మహిళ భద్రతపై రహస్య ఆపరేషన్

Aaj Ki Baath | మహిళ భద్రతపై రహస్య ఆపరేషన్

“అర్ధరాత్రి మహిళ నిర్భయంగా నడిచే రోజే నిజమైన స్వాతంత్య్రం” అన్నాడు గాంధీ. కానీ నేటి పరిస్థితుల్లో భద్రత ప్రశ్నార్థకమవుతోంది! హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్ సుమతి గారు సమాజ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఎవరికి సమాచారం ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడ్డారు. ఆ టైంలో 40 మంది యువకులు, ముఖ్యంగా మద్యం, గంజాయి మత్తులో ఉన్నవారు.. అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించారు. ఒక సాధారణ మహిళ రాత్రివేళ బయటకు వెళ్తే ఎదుర్కొనే భయానక వాస్తవాన్ని ఆమె స్వయంగా అనుభవించారు. అంతేకాదు, రాత్రి పెట్రోలింగ్ లోపాలను గమనించారు. వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు.. ఈ సంఘటనతో సమాజం కళ్ళు తెరిపించేలా చేసిన ఆమె సాహసోపేత ప్రయత్నం అభినందనీయం.. స్వేచ్ఛ అనేది మాటల్లో కాదు.. ప్రవర్తనలో ఉండాలి. యువత మత్తులో మునిగిపోవడం కాదు, మానవత్వాన్ని నిలబెట్టాలి.. జర మారండి బాబు!

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News