Thursday, May 7, 2026
Homeరంగారెడ్డిBJP Leader | ప్రాణం ఉన్నంతవరకు జైశ్రీరామ్ అని అంటాం

BJP Leader | ప్రాణం ఉన్నంతవరకు జైశ్రీరామ్ అని అంటాం

  • బీజేపీ మహిళ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి

కాంగ్రెస్ నాయకులకు మైకులు చేతికిచ్చిన గుంపులు గుంపులగా ప్రజలు ఒకే చోట కనబడితే,వాళ్ళు వెంటనే చేస్తున్న పని మన హిందూ దేవుళ్లను దేవాలయాలను తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన మేడ్చల్ బీజేపీ మహిళ నాయకురాలు బచ్చు కృష్ణ ప్రియా మల్లారెడ్డి.ఈ సందర్భంగా ఆమె బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మీకు హిందువులు అన్న హిందూ దేవుళ్ళు దేవాలయాలు అన్న ఎంత చిన్న చూపు మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో తెలిసింది నేడు కొండా సురేఖ మాటల్లో తెలిసింది అన్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవుళ్ళను కించపరిస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే అది ఆమె జ్ఞానానికే వదిలేస్తున్నాం అని ఎద్దేవా చేశారు.పుణ్యస్త్రీగా బొట్టు పెట్టుకొని గాజులు ధరించి హిందూ సంప్రదాయాలను పాటిస్తూ హిందూ దేవుళ్లను తిట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. కొండా సురేఖ జై శ్రీరామ్ అంటే మీకు పైనుండే ఏమైనా పైసలు పడుతున్నాయా అంటున్నారు మరి జై సోనియమ్మ అంటే నీకెన్ని పైసలు పడుతున్నాయి అని ఎద్దేవా చేసిన కృష్ణ ప్రియా రెడ్డి, పూటకు ఒక పార్టీ మార్చే నీకు ఇలాంటి విలువైన మాటలు చెప్పే ఎలా అర్థమవుతుంది.

- Advertisement -

భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిస్వార్థంతో పనిచేస్తున్నారు అని, రాముడు నడిచిన నేల ఇది శ్రీరాముని కథలు వింటూ పెరిగాం శ్రీరాముని తలుచుకుని పనులు మొదలు పెడతాం జై శ్రీరామ్ అనే నినాదం మా దేహంలో లీనం అయిపోయింది అని తెలిపారు, నీలాంటి వాళ్ళు ఇంకా వందమంది వచ్చి మొరిగిన మేము జైశ్రీరామ్ అనే నినాదాలు ఆపము బరబర్ అంటాము అని జైశ్రీరామ్ బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి మేడ్చల్ పట్టణ బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News