Tuesday, November 11, 2025
ePaper
HomeతెలంగాణCondolences | ముగిసిన హరీష్‌రావు తండ్రి అంత్యక్రియలు

Condolences | ముగిసిన హరీష్‌రావు తండ్రి అంత్యక్రియలు

  • తండ్రి సత్యానారాయణ కన్నుమూత…
  • బావకు నివాళి అర్పించి.. అక్కను ఓదార్చిన కేసీఆర్..
  • కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నివాళి..
  • మంత్రులు పొన్నం తదితరుల నివాళి..
  • సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ జగన్

సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీశ్ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ కోకాపేటలోని క్రిన్స్ విల్లాస్ లో ని ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హరీశ్రారావుకు పితృవియోగంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ పర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో నిర్వహించారు.

తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్ రావును ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లి, దివంగత సత్యనారాయణ పార్టీన దేహానికి నివాళులు అర్పించారు. తన సోదరిని, కుటుంబ సభ్యు లను ఓదార్చనున్నారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు కేసీఆర్ దైర్యం చెప్పారు.

ఇక హరీశ్ రావును గుండెలకు హత్తుకుని కేసీఆర్ ఓదార్చారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తన్నీరు సత్యనారాయణ రావు కన్ను మూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. కోకాపేటలోని క్రిన్స్ విల్లాస్లో ఉన్న ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటిం చారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ హరీశ్ రావును ఓదా ర్చారు. సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులర్పిం చారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘు నందన్ రావు, మాజీమంత్రులు ఎర్రబెల్లిదయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణెళి గుప్తా, మెతుకు ఆనంద్, హరీశ్ రావును పరామర్శించారు.

సత్య నారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు నివాళి అర్పించారు. అలాగే సిఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కటుఉంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఏపి మాజీ సిఎంజగన్ తదితరులు కూడా సంతా పం ప్రకటించారు. మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్రావు తండ్రి సత్య నారాయణరావు మృతి పట్ల ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సం తాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విచారం వ్యక్తం చేశారు. హరీశ్ రావు తండ్రి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిన ప్రార్థించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఆయన ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News