HomeఫోటోలుHappy Journey | మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆనందమే' రిలీజ్

Happy Journey | మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆనందమే’ రిలీజ్

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్,  కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై  బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ‘హ్యాపీ జర్నీ’ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Happy Journey Anandame First Song Release

ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు ‘ఆనందమే’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి, మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది.  ఈ పాట పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ, ఫీల్‌గుడ్ వైబ్‌తో సాగుతుంది. వేర్వేరు వయసుల వారు కలిసి పారిస్ ట్రిప్‌లో ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో ఈ పాటలో అందంగా చూపించారు.

- Advertisement -
Happy Journey Anandame First Song Release1

శేఖర్ చంద్ర అందించిన స్వరాలు ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. సురేష్ బానిసెట్టి రాసిన సాహిత్యం బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛగా ఎగిరే పక్షులతో మనసులోని ఆనందాన్ని పోలుస్తూ ఎంతో అందంగా సాగింది. సత్య యామిని తన ఎనర్జిటిక్ వోకల్స్ తో  పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. పారిస్ వీధులు, అందమైన లొకేషన్లు, ట్రిప్‌లోని సరదా క్షణాలు ప్రేక్షకులను కూడా ఆ ప్రయాణంలో భాగమైన భావన కలిగిస్తాయి.

Happy Journey Anandame First Song Release5

పారిస్, మాంట్‌పెలియర్, ఇతర అందమైన యూరప్ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్‌తో పాటు హృదయానికి దగ్గరైన భావోద్వేగాలను కూడా అందించబోతోంది. కథ విదేశీ నేపథ్యంలో సాగినా, అందులోని మనుషుల అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయి. నటీనటుల సహజమైన నటన, వారి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

 ‘ఆనందమే’ పాటతో ‘హ్యాపీ జర్నీ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచే అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

తారాగణం: అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వి దండముడి, వంశీ, రవి శివతేజ పైలా

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిరామ్ నాయుడు
నిర్మాతలు: బాలాజీ గుత్తా & కౌశిక్ రెడ్డి
బ్యానర్లు: గుత్తా ప్రొడక్షన్ & కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్
సహ నిర్మాత: తరుణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శైలేంద్ర కుమార్
సంగీతం: శేఖర్ చంద్ర
DOP: మణికందన్ సుబ్రమణియన్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పబ్లిసిటీ: అనిల్ & భాను
PRO: వంశీ-శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News