ఆదిలాబాద్(Adilabad) జిల్లావ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు నిర్వహించే దండాలు ఉత్సవాలలో భాగంగా బుధవారం భీంపూర్ మండలం భగవాన్పూర్, గుబిడి గ్రామాలలో నిర్వహించిన దండారి కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఐపీఎస్ ముఖ్య అతిథిగా, ఆదివాసీలతో మమేకమై పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి గ్రామ ప్రజలు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడి(Gussadi ) నృత్యాల నడుమ గౌరవ సాదరంగా ఆహ్వానాన్ని పలికారు. తదుపరి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి జిల్లా పోలీసు అధికారులతో కలిసి ఆదివాసీలు గ్రామ పెద్దలు యువత సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీలది ప్రపంచంలోనే అత్యంత విభిన్న సంస్కృతి కలిగిన సాంప్రదాయమని పేర్కొన్నారు. తన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించి భావితరాలకు తమ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా అభివృద్ధిని సాధించాలని సూచించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ విద్య, ఉపాధి వ్యవసాయం రంగాలలో ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ముఖ్యంగా యువతకు, పిల్లలకు చదువు పట్ల ప్రాధాన్యతను తెలియజేసి విద్యకు మొదటి ప్రాధాన్యతను కేటాయించాలని తెలియజేశారు. తల్లిదండ్రులు యువతను విద్యార్థులను ఉన్నత చదువుల అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసులతో కలిసి పోరాడాలని సూచించారు. ముఖ్యంగా ఎలాంటి వైద్య సమస్యలు ఉన్న వైద్య రంగాన్ని సంప్రదించాలని ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించి చికిత్సలను తీసుకోవాలని, ఎలాంటి బాబాలను మంత్రాలను తంత్రాలను నమ్మవద్దని సూచించారు.
తదుపరి గ్రామ సమస్యలు తెలియజేసిన ప్రజలు వారికి సంబంధిత అధికారుల ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా పోలీసుల తరఫున 24 గంటలు ఇలాంటి అత్యవసర సమయంలోనైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


