Homeరంగారెడ్డికవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలోకి గుర్రం వెంకటేష్

కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలోకి గుర్రం వెంకటేష్

రానున్న రోజుల్లో రాష్ట్రంలో తెలంగాణ జాగృతి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడం ఖాయమని యువ నాయకుడు గుర్రం వెంకటేష్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర బిసి సంఘం అధ్యక్షుడు మరన్న ఆధ్వర్యంలో జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం గుర్రం వెంకటేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కల్వకుంట్ల కవిత పోరాటాలను చూసి చేరడం జరిగిందన్నారు.

Gurram Venkatesh Joins Telangana Jagruthi Party0

ఉద్యమ కాలం నుండి తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో కవితమ్మ పోషించిన పాత్ర అసామాన్యమైనదని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని, యువత, మహిళలు, మరియు బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రయాణం ఒక పెద్ద భరోసా అని ఆయన అన్నారు.

- Advertisement -

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత రాజకీయ గందరగోళానికి తెరదించి, ప్రగతిశీల మార్గంలో ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణ అడుగులు వేయబోతున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News