బాలికలు తమ హక్కులు ఆత్మ రక్షణ పై అవగాహన పెంచుకోవాలని కస్తూరిభా పిఈటి శైలజ, ఉపాధ్యాయులు పి. సూర్యనారాయణలు తెలిపారు. మండలం లోని కస్తూర్బా బాలికల హాస్టల్ లో బాలికల హక్కుల పరిరక్షణ, అవగాహన, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం కాఫెడ్ స్వచ్చంధ సంస్థ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీచర్ పి సూర్యనారాయణ కస్తూర్బా పిటి కె శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల హక్కులను పరిరక్షించడం, వారికి తమ హక్కులపై అవగాహన కల్పించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, స్వీయ రక్షణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఎంతో అవసరం అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు బాలల హక్కులు, విద్యా హక్కు, రక్షణ హక్కు, సమానత్వం, బాల్య వివాహాల నివారణ, సురక్షితమైన వాతావరణం, తమకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బాలికలు ప్రమాదకర పరిస్థితుల్లో తమను తాము సురక్షితంగా కాపాడుకునే విధంగా ప్రాథమిక స్వీయ రక్షణ శిక్షణ అందించబడుతుందని వివరించారు.


అవసరమైనప్పుడు నమ్మకమైన పెద్దలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను,, సంబంధిత సహాయ వ్యవస్థలను సంప్రదించాల్సిన ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తారని తెలిపారు. కేర్ అండ్ షేర్ భావన ద్వారా బాలికలు ఒకరినొకరు గౌరవించడం, సహాయం చేసుకోవడం, సమస్యలను పంచుకోవడం, పరస్పరం ప్రోత్సహించుకోవడం నేర్చుకుంటారని పేర్కొన్నారు.
బాలికల భద్రత, గౌరవం, హక్కులు, భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి బాలిక భయంలేకుండా, ఆత్మవిశ్వాసంతో సురక్షితమైన వాతావరణంలో ఎదగడానికి ఇటువంటి అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి అని తెలియ చేశారు. అదేవిధంగా పిటి కే శైలజ యోగ శిక్షణ ఇవ్వటం జరిగింది. యోగ చేయటం వలన శరీరం ఆరోగ్యంగా చురుకుగా ఉంటుందన్నారు . ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగుపడటానికి సహాయ పడుతుందని వివరించారు.
ఆత్మ విశ్వాసం, ప్రశాంతత పెరుగుతాయి అని తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ 5th డాన్ జి హనుమంత్ బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పైన కరాటే నేర్పించారు. కరాటే వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సరైన సమయం లో స్వీయ రక్షణ గురించి అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్, యానిమేటర్స్ ఉషా, ఇందిరా, పద్మ, ప్రశాంత్, నరేశష్, కస్తూర్బా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
