Homeఆదాబ్ ప్రత్యేకంSaroornagar | రెండంతస్తుల అనుమతి.. ఐదంతస్తుల అరాచకం..

Saroornagar | రెండంతస్తుల అనుమతి.. ఐదంతస్తుల అరాచకం..

జీహెచఎంసీ సరూర్‌నగర్ సర్కిల్‌లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

  • సరూర్‌నగర్ సర్కిల్-12లో వెలుగులోకి భారీ నిర్మాణం
  • మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తులు
  • కాగితాలపై ఒక లెక్క.. క్షేత్రస్థాయిలో మరో తంతు
  • ఆమోదిత ప్లాన్, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్‌పై ప్రశ్నలు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ నిబం ధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమో లేక అక్రమార్కుల ప్రతాపమో గానీ, భవన నిర్మాణ అను మతులు ఒకలా ఉంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు మరోలా ఉంటున్నాయి. తాజాగా సరూర్‌నగర్ సర్కిల్-12 పరిధి లోని గడ్డిఅన్నారం గ్రామంలో వెలుగుచూసిన ఉల్లంఘనల ఉదం తం బల్దియా అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు తావి స్తోంది. గడ్డిఅన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 248, ప్లాట్ నంబర్ 14 (నార్తర్న్ పార్ట్, సదరన్ పార్ట్), హౌస్ నంబర్ 13-8-91 (కొత్త), 8-91 (పాత) పరిధిలో ఉన్న 160.28 చదరపు మీటర్ల స్థలంలో రెండు వేర్వేరు భవనాల నిర్మాణానికి జీహెచ్ ఎంసీ అనుమతులు మంజూరు చేసింది.

- Advertisement -

ఈ మేరకు అధికారులు అధికారికంగా ఫైళ్లు మరియు పర్మిట్లు సైతం జారీ చేశారు. ఫైల్ నంబర్ 018079/ జి.హెచ్.ఎం.సి./ 04857/ ఐ.ఎ.బి.పి./ సి5/ 2025, పర్మిట్ నంబర్ 3661/జి.హెచ్.ఎం.సి./ ఐ.ఎ./సి5/ 2025. ఫైల్ నంబర్ 018077/ జి.హెచ్.ఎం.సి./ 04856/ ఐ.ఎ.బి.పి./సి5/2025, పర్మిట్ నంబర్ 3660/జి.హెచ్.ఎం.సి./ ఐ.ఎ./సి5/2025. నియమ నిబంధనల ప్రకారం ఈ రెండు ప్లాట్లలో కేవలం స్టిల్ట్ పార్కింగ్ + రెండు పై అంతస్తుల నిర్మాణా నికి మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అనుమతించిన పరిమితిని మించి ఏకంగా స్టిల్ట్ + ఐదు అంతస్తుల భారీ భవనా లను నిర్మించేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే, మంజూరైన ప్లాన్కు విరుద్ధంగా ఏకంగా మూడు అదనపు అంతస్తులను అక్రమంగా నిర్మించారన్నమాట.

కాగితాలపై ఒక లెక్క.. క్షేత్రస్థాయిలో మరో తంతు!

భవన నిర్మాణ అనుమతి మంజూరు చేసే సమయంలో ఆమోదిం చిన ప్లాన్, నిర్మాణ విస్తీర్ణం, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ స్థలం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలి. కానీ, ఇక్కడ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, నిబంధనలను కాలరాశారు. రెండు అంతస్తు లకు బదులుగా ఐదు అంతస్తుల నిర్మాణం వెలసినా టౌన్‌ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సాధారణ ఉల్లంఘన కాకుండా, అత్యంత స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా కనిపిస్తున్నా అధి కారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తక్షణమే స్పందించాల్సిన బల్దియా యంత్రాంగం..

ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై ఫిర్యాదుదారుడు స్పష్టమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జీహెచఎంసీ సరూ ర్‌నగర్ సర్కిల్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి తనిఖీలు చేప ట్టాల్సి ఉంది. ఆమోదిత ప్లాన్‌ను, ప్రస్తుత నిర్మాణాన్ని బేరీజు వేసి వాస్తవాలను నిర్ధారించాలి. నిర్మాణాలు నిబంధనలకు విరు ద్ధంగా ఉన్నట్లు తేలితే.. ఎలాంటి మొహమాటాలు లేకుండా నోటీ సులు జారీ చేయడం, అదనపు అంతస్తులను సీజ్ చేయడం లేదా చట్ట పరమైన కూల్చివేత చర్యలు చేపట్టడం అధికారుల బాధ్యత. కేవ లం కాగితాలకే పరిమితం కాకుండా, అక్రమ నిర్మాణాలకు అండ గా నిలిచిన సిబ్బంది పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపితేనే భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు అడ్డుకట్ట పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News