Homeఆదాబ్ ప్రత్యేకంBloom Solutions | జీహెచఎంసీలో ‘బ్లూమ్ సొల్యూషన్స’ ఏకఛత్రాధిపత్యం..

Bloom Solutions | జీహెచఎంసీలో ‘బ్లూమ్ సొల్యూషన్స’ ఏకఛత్రాధిపత్యం..

  • వాటర్ బోర్డు, నిమ్స్ లో సైతం వారిదే హవా..
  • తెలంగాణాలో పాగా వేసిన ఆంధ్రాకు చెందిన కంపెనీ..
  • నిబంధనలు లేవు, ఎలాంటి రూల్స్ వారికి వర్తించవు..
  • వాళ్ళే నిబంధనలు రాసుకుంటారు.. వాళ్ళే టెండర్ తెచ్చుకుంటారు..
  • ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శలు..
  • ప్రస్తుత టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్స్..
  • పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని అభ్యర్ధన..
  • ప్రభుత్వం దృష్టి సారించాలని ఇతర టెండర్ నిర్వాహకుల వినతి..

జీ.హెచ్.ఎం.సి. అంటేనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ అని అందరూ భావిస్తుంటారు.. కానీ అక్కడే అంతులేని అవినీతి రాజ్యం ఏలుతోంది.. ఈ అవినీతి వ్యవహారాలపై ఆదాబ్ సాక్షాధారాలతో ఎన్నెనో కథనాలను ప్రచురించింది.. అయినా జీ.హెచ్.ఎం.సి. తీరు మారడం లేదు.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఓ టెండర్ ప్రక్రియ విస్తుపోయేలా చేస్తోంది.. అధికారుల అలసత్వం, అక్రమ సంపాదన యావ స్పష్టంగా తెలుస్తోంది..

రెండు దశాబ్దాలుగా జీ.హెచ్.ఎం.సి.లో సాగుతున్న భాగోతం ఈ లోకానికి తెలియకపోవడం దురదృష్టం.. అధికారుల దృష్టిలో ఉన్నా లంచాలకు అమ్ముడుపోయిన వారు అక్రమార్కులతో అంటగడుతూ.. జీ.హెచ్.ఎం.సి. ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా.. అర్హులైన టెండరుదారులకు అన్యాయం చేస్తున్నారు.. అర్హత కలిగిన వారు చేయాల్సిన ముఖ్యమైన ఆర్ధిక వ్యవహారాన్ని అనర్హులకు కట్టబెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.. అసలు ఏమి జరుగుతోంది..? ఒకసారి పరిశీలిద్దాం..

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దశాబ్దాలుగా జరుగుతున్న ఒక పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు 2006 నుంచి కార్పొరేషన్‌లో ‘ఈ ఆర్పీ’ వర్క’ అంటే ఆర్ధిక సంబంధిత బాధ్యతలను ‘బ్లూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ’ అనే ఒకే ఒక్క ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ, ప్రజాధ నాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ కంపెనీయే నిరంతరాయంగా పనులు దక్కించుకోవడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు, అధికారుల అభయహస్తం ఉందన్న ఆరోపణలు తీవ్రకలకలం రేపుతున్నాయి.

వంద మంది ఉద్యోగుల పేరుతో బిల్లులు :
పని చేసేది మాత్రం 60 – 70 మంది మాత్రమే :

ఈ వ్యవహారంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంఖ్యలో జరుగుతున్న మోసం. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు 100 మంది ఉద్యోగులు విధుల్లో ఉండాలి. కానీ, సదరు కంపెనీ కేవలం 60 నుంచి 70 మందితో మాత్రమే పనులు నడిపిస్తూ, మిగతా డమ్మీ పేర్లతో 100 మందికి పూర్తిస్థాయిలో బిల్లులు రాసుకొని జీహెచఎంసి ఖజానాను గుల్ల చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఈ ‘దొంగ బిల్లుల దందా’ను కప్పిపుచ్చుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరీ దారుణం ఏమిటంటే ఈ కంపెనీ ప్రతినెలా సుమారుగా రూ.40 లక్షల బిల్లులు తీసుకుంటు న్నారు.. ఇప్పుడు జీ.హెచ్.ఎం.సి. మూడు జోన్లుగా మారిపో యేసరికి సుమారు రూ. 70 లక్షల వరకు బిల్లులు సబ్మిట్ చేసుకునే అవకాశం దొరికింది.. కానీ జీతాలు చెల్లించేది సగం మందికి మాత్రమే కనుక సగం డబ్భులు దొంగ బిల్లులతో స్వాహాచేసి, మిగిలిన సగం పైకంలో అవినీతి అధికారులకు కొంత మొత్తం చెల్లించి.. మిగతాది తమ జేబుల్లో నింపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెండర్ల పేరుతో దొంగ నాటకం :

పారదర్శకంగా జరగాల్సిన టెండరింగ్ ప్రక్రియను అధికారులు, సదరు సంస్థ కలిసి పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా మార్చేశారు.
ఏ ఒక్క సంవత్సరంలో కూడా సరైన సమయంలో, బహిరంగంగా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. సాధారణ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా ఉండేందుకు, ఆన్‌లైన్ టెండర్ సిస్టమ్‌లో పాస్‌వర్డ్‌లు, సీక్రెట్ కోడ్‌లు పెట్టి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది.ఇకపోతే బ్లూమ్ సొల్యూషన్స్ కంపెనీకి మాత్రమే సెట్ అయ్యేలా అర్హతలు, నిబంధనలను తయారు చేస్తూ ఇతరులను రేసు నుంచి తప్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం సీఏ అర్హత ఉన్నవారు చేయాల్సిన ఆర్థిక సంబంధిత బాధ్యతలను, ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టడం వెనుక అంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

వెంటనే ‘రీ-టెండరింగ’ జరపాలి :

ఒకే ప్రైవేట్ కంపెనీకి 20 ఏళ్ల పాటు కార్పొరేషన్ పనులను అప్పగించడం ద్వారా మిగతా అర్హత కలిగిన ఏజెన్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన వ్యవస్థను ఒకే కంపెనీ ప్రైవేట్ ఆస్తిగా మార్చేశారనే ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.. అలాగే మూడు జోన్లకి సపరేటుగా టెండర్ ప్రక్రియ జరపాలని కోరుతున్నారు.. ఎందుకంటే మూడు జోన్లకి టెండర్ ప్రక్రియలో ఇంకా కొంత మందికి అవకాశం లభిస్తుంది.. అలాగే ఉద్యోగస్తులు కూడా పెరుగుతారు..

తక్షణమే ఈ కుంభకోణంపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపించాలి. బ్లూమ్ సొల్యూషన్స్ కాంట్రాక్టును రద్దు చేసి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పాల్గొనేలా కొత్తగా ‘రీ-టెండరింగ’ నిర్వహించాలని స్థానిక ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ భాగోతంపై న్యాయపోరాటానికి వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది

‘ఆదాబ్ హైదరాబాద’. మా అక్షరం అవినీతిపై అస్త్రం..

- Advertisement -
RELATED ARTICLES

Latest News