Homeఆదిలాబాద్Praja Darbar | మంచిర్యాల ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్

Praja Darbar | మంచిర్యాల ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్

  • నిర్వహించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ ప్రెసిడెంట్ రఘునాథ్ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను ఎంపీ గారు శ్రద్ధగా చదివి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

- Advertisement -
Gaddam Vamsi Krishna Holds Praja Darbar In Mancherial

అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడడం తన ముఖ్య లక్ష్యమని ఎంపీ అన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News