Friday, January 16, 2026
EPAPER
Homeకరీంనగర్Medical Camp | నేడు రామన్నపేటలో ఉచిత కంటి వైద్య శిబిరo

Medical Camp | నేడు రామన్నపేటలో ఉచిత కంటి వైద్య శిబిరo

బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు (బుధవారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాక బి సి ఎం కంటి దవాఖాన వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్ష చేసి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఉచిత కంటి ఆపరేషన్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చింతలపల్లి కవిత వెంకట్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News