ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(Financial Year)లోని మొదటి అర్ధ భాగంలో ద్రవ్య లోటుకు సంబంధించి కంట్రోలర్ జనరల్ అకౌంట్స్(Controller General Accounts).. సీజీఏ.. డేటా విడుదల చేసింది. 2025-26లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో రూ.5.73 లక్షల కోట్ల ద్రవ్యలోటు నెలకొంది. ప్రభుత్వం చేసే ఖర్చు(expenditure)కి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి (Income) మధ్య తేడాను ద్రవ్యలోటుగా పేర్కొంటారు. ఇది వార్షిక లక్ష్యంలో 36.5 శాతంగా నమోదైంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం (Government).. మార్కెట్ (Market) నుంచి లోన్లు (Loans) తీసుకుంటుంది. అయితే.. ఈ ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతంగా.. అంటే.. రూ.15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ (Budget) అంచనాలో పేర్కొంది. ప్రథమార్ధం లోటు ఈ అంచనాలో 36.5 శాతానికి సమానం. ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో ప్రభుత్వానికి 17.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. వార్షిక బడ్జెట్ అంచనాలో ఇది 49.5 శాతానికి సమానం.
