Sunday, April 19, 2026
Homeఆరోగ్యంCoffee | కాఫీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు..

Coffee | కాఫీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు..

  • కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం తెలుసుకోవాలి..

కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే తాజా పరిశోధనలు, నిపుణుల సూచనల ప్రకారం కాఫీ గట్ (జీర్ణ‌వ్య‌వ‌స్థ‌), లివర్ ఆరోగ్యానికి కూడా మేలు చేయగలదని చెబుతున్నాయి. సుగంధభరితమైన రుచి కలిగిన ఈ పానీయం కెఫీన్ అనే సహజ ఉద్దీపన పదార్థం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శారీరక, మానసిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించడం అవసరం. కాఫీకి సంబంధించిన సరైన రకం, తాగే సమయం, పరిమాణం, అలవాట్లను దృష్టిలో ఉంచుకోవ‌డం కూడా చాలా అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా అత్యంత ఆరోగ్యకరమైన కాఫీ రకం ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ అని, ఉదయం నిద్రలేచిన 60 నుండి 90 నిమిషాల తర్వాత కాఫీ తాగడం ఉత్తమ సమయమ‌ని, సాధారణంగా రోజుకు 1 నుంచి 3 కప్పులు మించకుండా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కాఫీ మెదడు, గట్, లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని, పాలీఫినాల్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని, దృష్టి కేంద్రీకరణను మెరుగుపరుస్తాయని, అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చున‌ని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో కాఫీ పాత్ర ఉండొచ్చని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News