Wednesday, January 14, 2026
EPAPER
Homeక్రైమ్ వార్తలుGoa Fire Accident | రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Goa Fire Accident | రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

గోవాలోని ఓ నైట్ క్లబ్‌(Night Club)లో రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. 50 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు టూరిస్టులు (Tourists) కాగా 14 మంది సెక్యూరిటీ (Security) సిబ్బంది అని చెబుతున్నారు. ఉత్తర గోవా అర్పోరాలోని రోమియో లేన్‌లో ఈ క్లబ్ ఉంది. సిలిండర్ (Cylinder) పేలడం వల్ల దుర్ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి (Deep shock) వ్యక్తం చేశారు. బాధాకరమైన విషయమని ఎక్స్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం విషయమై గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మాట్లాడినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News