Homeనిజామాబాద్‌Farmers | కోటగిరిలో రోడ్డెక్కిన రైతన్న

Farmers | కోటగిరిలో రోడ్డెక్కిన రైతన్న

నిజామాబాద్ (Nizamabad) జిల్లా కోటగిరి మండలంలో దాదాపు 200 మంది రైతన్నలు గురువారం రోడ్డెక్కారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో (Rice Mill) మోసాల (frauds) పట్ల నిరసన (Protest) వ్యక్తం చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా (Dharna) చేపట్టారు. తరుగు పేరుతో నష్టపరిస్తే ఊరుకునేదిలేదని వార్నింగ్ (Warning) ఇచ్చారు.

అన్నదాతలు రెండు గంటలపాటు కోటగిరి-పోతంగల్ రహదారిపై బైఠాయించడంతో రాకపోకలు స్థంభించాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేయటంతో పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వటంతో కర్షకులు శాంతించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News