Homeనల్లగొండDJ Seized | పెదవీడులో డీజే సీజ్… నిర్వాహకులపై కేసు నమోదు

DJ Seized | పెదవీడులో డీజే సీజ్… నిర్వాహకులపై కేసు నమోదు

మఠంపల్లి: గణేశ్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా అధిక శబ్దాలు చేసే డీజేలు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు తెలిపారు. శనివారం సాయంత్రం మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో గణేష్ శోభాయాత్రలో అధిక శబ్దాలతో డీజే(DJ Seized) వినియోగించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించిన ఘటనలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మఠంపల్లి ఎస్సై బి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెదవీడు గ్రామంలో నిమజ్జనం ఊరేగింపులో భారీ శబ్దాలతో సౌండ్ సిస్టం నడుపుతుండటంతో సదరు డీజే వాహనం,సామగ్రిని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించామని తెలిపారు.

- Advertisement -

ఉత్సవ కమిటీల సభ్యులకు ముందుగానే నిబంధనలపై అవగాహన కల్పించినప్పటికీ గ్రామంలో అధిక శబ్దాలతో డీజే వినియోగిస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని డీజే శబ్దాలను నిలిపివేయాలని నిర్వాహకులకు సూచించామని అయిన కొందరు వ్యక్తులు తమ సూచనలను పట్టించుకోకుండా డీజేను కొనసాగించినట్లు ఎస్సై తెలిపారు.అంతేకాకుండా విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించినట్లు పేర్కొన్నారు.నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News